రేపే బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' మూవీ టీజర్ రిలీజ్..

- April 17, 2018 , by Maagulf
రేపే బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' మూవీ టీజర్ రిలీజ్..

బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజాహెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సాక్ష్యం. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. మే 11వ తేదిన విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ టీజర్ ను రేపు రిలీజ్ చేయనున్నారు.. . ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ.ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలచేసిన పోస్టర్‌కు విశేషమైన స్పందన లభించిందని చెప్పారు. మే 11న సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. ఇంతవరకు రామోజీ ఫిలింసిటీ, పొల్లాచ్చి, వారణాసి, హౌస్‌పేట తదితర లోకేషన్లలో చిత్రీకరణ జరిపామని చెప్పారు. ఈ సినిమాలో ఫైట్స్‌ సీక్వెన్స్‌లకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ లుక్‌ ఈ చిత్రంలో సరికొత్తగా ఉంటుందని అన్నారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్‌ సన్నివేశాలతో పాటు హీరో చేసే సాహసోపేతమైన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. 
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్‌కుమార్‌, మీనా, బ్రహ్మాజీ, రవికిషన్‌, అశుతోష్‌రానా, పవిత్రలోకేష్‌, వెన్నెల కిషోర్‌, మధు గురుస్వామి, లావణ్య తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, సినిమాటోగ్రఫీ: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: హర్షవర్ధన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com