అదరగొడుతున్న 'సాక్ష్యం' టీజర్

- April 18, 2018 , by Maagulf
అదరగొడుతున్న 'సాక్ష్యం' టీజర్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. డిక్టేటర్ ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ భూమ్మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరూ నాలుగు దిక్కులు వెతికి ఎవరూ చూడలేదనుకుంటారు. కానీ పై నుండి 5వ దిక్కు ఒకటి మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. అదే కర్మ సాక్ష్యం... దాని నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు ' అనే డైలాగుతో మొదలైన ఈ టీజర్ సూపర్బ్ అనేలా ఉంది.

యాక్షన్ సీన్స్, డాన్స్ లాంటి అంశాల్లో సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో హీరో చేసే స్టంట్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని టీజర్ చూస్తే స్పష్టం అవుతోంది.

సాయి శ్రీనివాస్ గత చిత్రం 'జయ జానకి నాయక'కు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. 'డిక్టేటర్2, 'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మర్షవర్ధన్ సంగీతం అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com