మలయాళంలో 'బిగ్‌బాస్'.. వ్యాఖ్యతగా మోహన్‌లాల్.!
April 18, 2018
టీవీ రియాల్టి షో 'బిగ్‌బాస్' భారత్‌లో మంచి ఆదరణ దక్కించుకుంది. సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో క్రమేసి ఇతర భాషలకూ విస్తరించింది. తాజాగా మలయాళంలోనూ 'బిగ్‌బాస్'ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షో నిర్వాహకులు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.