'నీ ప్రేమ కోసం' ఆడియో రిలీజ్
- April 18, 2018జొన్న పరమేష్, రాధ బంగారు జంటగా ఉలి దర్శకత్వంలో మాస్టర్ గోవింద్ బోగోజు సమర్పణలో సరోవర్ ఫిలిమ్స్ పతాకంపై ఉప్పుల గంగాధర్ నిర్మిస్తోన్న చిత్రం `నీ ప్రేమ కోసం`. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్ పిలిం ఛాంబర్ లో నిర్వహించారు. నంబీ వేణుగోపాలా చార్య కౌశిక సీడీలను ఆవిష్కరించి అతిధులకు , యూనిట్ సభ్యులకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, `ఉలి అన్నీ తానై పనిచేశాడు. అతని కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటాడు. ప్రతిభ గల దర్శకుడు. సినిమా విజయం సాధించి యూనిట్ అందిరకి మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలి` అని అన్నారు.
చిత్ర దర్శకుడు ఉలి మాట్లాడుతూ, `రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. ప్రపంచ శాంతి సందేశంలో అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా నిలుస్తుంది. ప్రేమ కాన్సెప్టెకు..నేను పెట్టిన `డు ఆర్ డై` అనే ఉపశీర్షికకు సంబంధం ఏంటని చాలా మందికి సందేహాలున్నాయి. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ కథను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కించాను. అంతా చక్కగా నటించారు. ప్రేక్షకులంతా మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
సహ నిర్మాత: గోలి వెంకట రమణ మాట్లాడుతూ, ` నిజ జీవితంలో మనుషుల పాత్రలు మా సినిమాలో కనిపిస్తాయి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, బాధలు ఉంటాయి. వాటిని మా దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయని ఆశిస్తున్నా` అన్నారు.
హీరోయిన్ రాధ బంగారు మాట్లాడుతూ, ` నాకిది తొలి సినిమా. మంచి పాత్రలో నటిస్తున్నా. అందరికీ నచ్చుతుంది. సినిమా కోసం టీమంతా చాలా కష్టపడి ఇష్టంగా పనిచేసాం` అని అన్నారు.
ఈ మూవీలో గౌరవ అతిథి పాత్రలో నంబి వేణుగోపాలాచార్య కౌశిక, ముఖ్య అతిథి పాత్రలో సింహరాజు కొదండ రాములు, ప్రత్యేక పాత్రలో శ్రీ మంజునాథ విజయ్ బాబు నటిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సంజయ్, పులి అమృత్ గౌడ్, పాండు రంగారావు, సింహరాజు, మంజులా సిరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలో సాయి డిజిటల్ రవి, కళ్యాణ్ చక్రవర్తి, అశోక్ బోగే, రమ్య శ్రీ, కాసాల శ్రీనివాస్, కొమ్ము సుజాత, కంప్యూటర్ ప్రభాకర్, వంశీ కృష్ణ, కే.ఆర్, కృష్ణ, మాస్టర్ గోవింద్ బోగోజు, విష్ణుగిరి, యెన్నమనేని శ్రీనివాసరావు, వెంటరమణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేమూరి చంద్రశేఖర్, ఎడిటింగ్: సంపత్ రాజ్, సత్రాజ్, ఆర్ట్: బొద్దున జయకృష్ణ, సంగీతం: కె. లక్ష్మణ సాయి, నిర్మాత: ఉప్పుల గంగాధర్, కథ, మాటలు, పాట, చిత్రకథనం, దర్శకత్వం: ఉలి.
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!