జూలైలో విడుదలకు సిద్ధం కానున్న శ్రీనివాస కళ్యాణం..!
- April 18, 2018లవర్ బోయ్ నితిన్, గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని తప్పక అలరిస్తుందని అంటున్నారు. మిక్కి జే మేయర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నందిత శ్వేత, ప్రకాశ్‌రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తొలి షెడ్యూల్ గోదావరి జిల్లాలలో షూటింగ్ జరుపుకున్న టీం కొద్ది రోజుల క్రితం రెండో షెడ్యూల్ కోసం చండీఘర్ వెళ్లింది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి జూలై 24న మూవీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీం ఉన్నట్టు తెలుస్తుంది. నితిన్ నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో శ్రీనివాస కళ్యాణంపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం టైటిల్ లోగోతో పాటు పెళ్ళి పీటలపై కూర్చున్న నితిన్, రాశీ ఖన్నా ఫోటోని, పెళ్లికి సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్. ఇవి అభిమానులలో సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?