భాగ్యనగరం లో సచిన్ సందడి

- April 19, 2018 , by Maagulf
భాగ్యనగరం లో సచిన్ సందడి

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్‌లో సందడి చేశాడు. కెపిహెచ్‌బి ఫోరమ్‌ మాల్‌లో స్మాష్ గేమింగ్‌ జోన్‌ను సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన నేషనల్ బౌలింగ్ టోర్నీలో విజేతలకు బహుమతులు అందజేశాడు. సచిన్‌ రాకతో మాల్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఒక దశలో అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు , నిర్వాహకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో సచిన్ చాలాసేపు మాల్‌లో ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకి రాలేకపోయాడు. కాగా తల్లిదండ్రులు తమ చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించాలని సచిన్ సూచించాడు. క్రికెట్టే కాకుండా ఏ క్రీడల్లోనైనా తమ పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిదేనని వ్యాఖ్యానించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com