వైఎస్సార్ సతీమణిగా రమ్యకృష్ణ!
- April 19, 2018టాలీవుడ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ తారలైన మహానటి సావిత్రి, మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో మొదటి సారిగా రాజకీయ నేతపై సినిమా తీస్తున్నారు. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర' సినిమాతో మళియాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్సార్ బయోపిక్‌లో జగన్ భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.ఆనందో బ్రహ్మ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని.. విజయ్ చిల్లా.. దేవిరెడ్డి శశి ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి పాత్ర మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా..ఆయన సతీమణి పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
తాజాగా నయనతార ప్లేస్ లో బాహబలిలో శివగామిగా అద్భుత నటన ప్రదర్శించిన నటి రమ్యకృష్ణను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
ప్రజలకు ఎన్నో ఉపాధి పథకాలు..అభివృద్ది సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారు. రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చారు..అందుకే ఆయన ప్రజా నాయకుడు అయ్యారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తు హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాశారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ సినిమాపై వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్‌లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం