''టుస్సాడ్స్‌'' లో చోటు దక్కిన మొదటి భారతీయ డైరెక్టర్!

''టుస్సాడ్స్‌'' లో చోటు దక్కిన మొదటి భారతీయ డైరెక్టర్!

ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో తమ మైనపు విగ్రహాలు ఉండాలని ప్రతీ నటి, నటుడు కోరుకుంటారు. తాజాగా బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్ మైనపు విగ్రహం అందులో కొలువు దీరబోతోంది. టుస్సాడ్స్‌లో ఉంచబోతున్న తొలి భారతీయ దర్శకుడు, నిర్మాత మైనపు బొమ్మ కరణ్ ది కావడం విశేషం. తన విగ్రహం తయారుచేయబోతున్న మేడమ్‌ టుస్సాడ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. మైనపు విగ్రహం ఉన్న ఏకైక భారతీయ దర్శక-నిర్మాత తానే కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆరు నెలల్లో విగ్రహం సిద్ధవుతుందని టుస్సాడ్స్‌ సిబ్బంది వెల్లడించారు.

Back to Top