అనీల్ కపూర్, మాధురీ దీక్షిత్ మొదటి లుక్ విడుదల
- April 21, 2018
అనీల్ కపూర్, మాధురీ దీక్షిత్ .. ఈ కాంబినేషన్ ని 80,90లలో రొమాంటిక్ పెయిర్ గా చెప్పుకునే వారు. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే అదీ పక్కా హిట్ అనే మూడ్ లో ఉండేవారు అప్పటి ఆడియన్స్. చివరిగా 2000 సంవత్సరంలో రూపొందిన రాజ్ కుమార్ సంతీషి డ్రామా మూవీ పుకర్ సినిమాలో కలిసి పని చేశారు అనీల్ కపూర్, మాధురీ దీక్షిత్. ఇప్పుడు 17 సంవత్సరాల మళ్ళీ ఈ కాంబినేషన్ ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఇంద్ర కుమార్ . ఈ డైరెక్టర్ ఆ జంటతో కలిసి బేటా అనే సినిమా తెరకెక్కించగా ఇది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో సారి క్రేజీ కాంబోతో టోటల్ డమాల్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు ఇంద్రకుమార్. తాజాగా అనీల్ కపూర్, మాధురీ దీక్షిత్‌ల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిత్రానికి సంబంధించిన పిక్ అనే టాక్ వినిపిస్తుండగా, ఇందులో మాధురీ దీక్షిత్ భుజంపై రెండు చేతులు వేసి డిఫరెంట్ స్టిల్ ఇచ్చాడు అనీల్ కపూర్. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. కామెడీ యాంగిల్ లో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అభిమనుల మనసులలో చిరస్థాయిగా నిలిచేలా తమ చిత్రం ఉంటుందని ఇంద్ర కుమార్ అంటున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







