క్యాబినెట్‌ నిర్ణయాల్ని ప్రకటించిన ఎమిర్‌

- December 04, 2015 , by Maagulf
క్యాబినెట్‌ నిర్ణయాల్ని ప్రకటించిన ఎమిర్‌
 


క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల్ని ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని వివరించారు. రియల్‌ ఎస్టేట్‌కి సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన అనంతరం క్యాబినెట్‌ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. బోట్సువానా ప్రతినిథి బృందంతో ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ జాసిమ్‌ సైఫ్‌ అమ్మద్‌ అల్‌ సులైటి సమావేశమయ్యారు. ఖతర్‌ బోట్సువానా మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా పెరగడానికి, ట్రాన్స్‌పోర్ట్‌, కమ్యూనికేషన్‌ రంగాలో పరస్పర సహకారానికి ఉద్దేశించినదైన ఈ సమావేశం విజయవంతమయ్యింది. పోలిష్‌ ప్రెసిడెంట్‌, అహ్మద్‌ సైఫ్‌ అల్‌ మువాదదిని పోలాండ్‌లోని ఖతార్‌ అంబాసిడర్‌ విషయమై కలిశారు. పోలిష్‌ ప్రెసిడెంట్‌ ఖతార్‌ రాయబారిని ప్రశంసలతో ముంచెత్తారు, తన బాధ్యతల్ని ఖతార్‌ రాయబారి సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు. అలాగే ఖతార్‌ అర్జింటీనా మధ్య సంబంధాలపై రివ్యూ చేశారు. బ్యూనస్‌ ఎయిర్స్‌ మేయర్‌, ఖతార్‌ అంబాసిడర్‌ ఫహాద్‌ బిన్‌ ఇబ్రహీమ్‌ అల్‌ హమాద్‌ అల్‌ మనాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై వారిరువురూ చర్చించారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com