అవార్డ్‌ గెల్చుకున్న మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌

- April 21, 2018 , by Maagulf
అవార్డ్‌ గెల్చుకున్న మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌

మస్కట్‌: మస్కట్‌ ఇంటర్నేషనల్‌ కొత్త ప్యాసింజర్‌ టెర్మినల్‌కి 2018 వరల్డ్‌ ట్రావెల్‌ అవార్డ్‌ - మిడిల్‌ ఈస్ట్‌ లీడింగ్‌ న్యూ టూరిజం డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ అవార్డ్‌ దక్కింది. ఒమన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చింది. అవార్డ్‌ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఒమన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌, ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. రస్‌ అల్‌ ఖైమాలో 25వ వరల్డ్‌ ట్రావెల్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల్ని ట్రావెల్‌ మరియు టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com