ఆ నటుడి విషయంలో కన్నీరుపెట్టిన శింబు

ఆ నటుడి విషయంలో కన్నీరుపెట్టిన శింబు

తమిళ నటుడు శింబు మీడియా ముందు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'చెక్క చీవంత వానం'. తెలుగులో 'నవాబ్‌'గా రాబోతోంది. ఇందులో మన్సూర్‌ అలీ ఖాన్ అనే ఓ తమిళ ఆర్టిస్ట్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మన్సూర్‌, శింబు మంచి స్నేహితులు. ఆయన ఇటీవల జరిగిన కావేరీ ఆందోళనల్లో పాల్గొని తమిళనాడుకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. అయితే ఇటీవల శింబు ఆయన కుమారుడికి ఫోన్‌ చేయగా మన్సూర్ ను వారం రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారట. అసలు ఆయన బతికే ఉన్నారో లేదో కూడా తెలియదని భావోద్వేగానికి లోనయ్యారు.

Back to Top