వివాహ వేడుకపై వైమానిక దాడి: 20మంది మృతి

- April 23, 2018 , by Maagulf
వివాహ వేడుకపై వైమానిక దాడి: 20మంది మృతి

దుబాయి: సౌదీ అరేబియాలోని యెమన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు సమాచారం. సౌదీ సైన్యం నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన ఈ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. మృతదేహాలను హజ్జాలోని అల్‌ జుమ్‌హౌరీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com