మస్కట్:వీసా ఎగ్రిమెంట్‌తో ఒమన్‌లోకి ఉచిత ప్రవేశం
- April 24, 2018
మస్కట్: 33 దేశాల నుంచి ఒమన్‌కి వచ్చేవారికి వీసా లేకుండానే ఉచితంగా ఒమన్‌లోకి ప్రవేశం లభిస్తుంది. ఈ మేరకు ఒమన్, ఖతార్ మధ్య కుదిరిన ఒప్పందం సహకరిస్తుంది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్ - ఖతార్ దేశాల మధ్య ఒప్పందం కుదిరిందనీ, ఈ ఒప్పందంలో భాగంగా జాయింట్ టూరిస్ట్ వీసాల ద్వారా ఇది సాధ్యపడుతుందని తెలిపారు. ఖతార్‌లో వీసా పొందే టూరిస్టులు ఒమన్‌లోకి ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ప్రవేశించొచ్చు. ఒమన్ నుంచి వీసా పొందే టూరిస్టులకూ ఇదే నియమం వర్తిస్తుంది. ఒమన్‌లో జాయిట్ వీసా కోసం 20 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వుంటుంది. ఖతార్‌లో అయితే ఇది 100 ఖతారీ రియాల్స్ వుంటుంది. జాయింట్ వీసా నెలరోజులపాటు చెల్లుబాటవుతుంది. మొత్తం 33 దేశాలకు చెందినవారికి ఈ జాయింట్ వీసా సౌకర్యం కల్పిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఐస్‌లాండ్, ఇటలీ, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, మలేసియా, హాంగ్ కాంగ్, న్యూజిలాండ్ తదితర దేశాలు ఈ లిస్ట్‌లో వున్నాయి.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







