పవన్ కళ్యాణ్‌కు ఆర్కే లీగల్ నోటీసు
- April 24, 2018
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తోన్న వరుస ట్వీట్లపై 'ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' ఎండీ వేమూరి రాధాకృష్ణ సీరియస్ అయ్యారు. ఆరోపణల ట్వీట్లు తొలగించి లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాను పెట్టబోయే సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈమేరకు పవన్ కళ్యాణ్ కు 'ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' ఎండీ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపించారు.
తనపైనా, తన సంస్థపైనా చేసిన ఊహాజనిత, నిరాధార ఆరోపణలను, ట్వీట్లను ట్విటర్ నుంచి తొలగించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత, రాజకీయ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు.. పవన్ కావాలని, ఉద్దేశపూర్వకంగా చేసిన ఆ ట్వీట్లలో ఏమాత్రం వాస్తవం లేదని అందులో ఆర్కే స్పష్టం చేశారు. పవన్ అభిమానులు 'ఆంధ్రజ్యోతి, ఏబీఎన్' రిపోర్టర్లపై దాడి చేసి గాయపరిచారని, ఓబీవ్యాన్‌ను ధ్వంసం చేశారని ఆర్కే గుర్తుచేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి పవన్ ట్విటర్‌లో తనపై నిర్లక్ష్యపూరిత ఆరోపణలు చేస్తున్నారని రాధాకృష్ణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







