ఆడవేషంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్...

- April 26, 2018 , by Maagulf
ఆడవేషంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్...

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ఈ ఆడ వేషం ఏంటి.. చేతిలో ఆ పార ఏంటి..  పొలంలో ఆ పనులేంటి.. అసలేమైంది ఈయనకు. అన్నీ ఇలాంటి తిక్క పనులే చేస్తారు అని అనుకుంటున్నారా.. అస్సలు కాదండి.. ఈ భూమి మీద మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్ద వాళ్లు అంటుంటారు. అది నిజమేనేమో అనిపిస్తుంది ఇలాంటి వారిని చూస్తే అచ్చం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ఉంది స్పెయిన్‌కు చెందిన ఓ మహిళ. డొలోరెస్ లెయిస్ ఆంటెలో అనే ఈ మహిళా రైతు దూరం నుంచి చూస్తే అచ్చం ట్రంప్ లానే ఉందంటూ ఈమె ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫొటో షేర్లు, లైకులతో హల్ చల్ చేస్తోంది. ఇక ఆంటె కూతురైతే మేం ట్రంప్ చుట్టాలైతే ఎంత బావుండేదో అంటూ కాసేపు సరదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com