బాలీవుడ్ హీరో దుస్తులకు భారీ డిమాండ్.. వారం రోజుల్లో రూ.3 కోట్లు
- April 28, 2018
సాధారణంగా ప్రముఖులు, దేశాధి నేతలు వాడిన వస్తువులను వేలంలో విక్రయిస్తుంటారు. తమ అభిమాన నటీ నటులు వాడిన వస్తువులను కూడా వేలాని వుంచుతుంటారు యూనిట్ సభ్యులు. టాలీవుడ్‌లో కూడా ఈ ట్రెండ్ నడిచింది. సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న సినిమాలో అతడు వాడిన సైకిల్ వేలంలో భారీ ధరకు అభిమానులు సొంతం చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన రుస్తుం దేశభక్తి ప్రాధాన్యత కలిగిన చిత్రం. ఈ సినిమాలో అక్షయ్ నేవీ అధికారిగా నటిస్తాడు. 2016లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గానూ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.124 కోట్లను వసూలు చేసింది.
ఈ చిత్రంలో అక్షయ్ ధరించిన దుస్తుల్ని వేలానికి ఉంచారు. వేలంలో వచ్చిన మొత్తాన్ని జంతు సంరక్షణ కోసం పనిచేసే ఓ ఎన్జీవో సంస్థకు విరాళంగా అందజేయనున్నారు. ఈ నెల 20న ప్రారంభమైన వేలం పాటలో వారం రోజులకే దుస్తుల ధర రూ. 3కోట్లకు చేరుకుంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ వేలం పాటలో మరింత రేటు పలికే అవకాశం ఉందని వేలం అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ కేసరి, గోల్డ్ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. రజనీకాంత్ నటిస్తున్న 2.ఓలో అక్షయ్ ఓ విలన్ కారెక్టర్లో నటించాడు. సామాజిక అంశాలను ప్రధానంగా చూపిస్తూ సమాజం పట్ల తన బాధ్యతను చిత్రాల ద్వారా చూపిస్తుంటాడు అక్షయ్ కుమార్. ఆయన నటించిన టాయ్‌లెట్.. ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి