ఏపీలో కొత్త కొలువులు: 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు

- April 28, 2018 , by Maagulf
ఏపీలో కొత్త కొలువులు: 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు

అమరావతి:నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా 10,351 పోస్టులకు నోటిపికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 4న టెట్ నోటిఫికేషన్, జులై 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని , జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్‌లైన్‌లో డీఎస్సీని నిర్వహిస్తామని మంత్రి  తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com