హమస్‌ పోస్ట్‌పై ఇజ్రాయిల్‌ క్షిపణుల దాడి

- April 28, 2018 , by Maagulf
హమస్‌ పోస్ట్‌పై ఇజ్రాయిల్‌ క్షిపణుల దాడి

ఇజ్రాయిల్‌ సైన్యం హమస్‌ పోస్ట్‌పై శుక్రవారం రాత్రి రెండు క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమ గాజా నగరంలో జాలర్ల హార్బర్‌కు సమీపంలో గల హమస్‌ స్థావరంపై జరిగిన ఈ దాడిలో భవనం, రెండు సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇజ్రాయిల్‌ సైన్యం కూడా వెంటనే స్పందించలేదు. మార్చి 30వ తేది నుండి ఇజ్రాయిల్‌, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో గాజా నగరంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ వేలాదిమంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తూర్పు గాజాలో శుక్రవారం వందలాదిమంది పాలస్తీనియన్లు, ఇజ్రాయిల్‌ సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించగా, 800మందికి పైగా గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com