కార్ల దొంగతనం: ఇద్దరి అరెస్ట్‌

- May 02, 2018 , by Maagulf
కార్ల దొంగతనం: ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌: అల్‌ ఖౌద్‌ ప్రాంతంలో పార్కింగ్‌ చేసిన కార్లను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించారు. ఇప్పటిదాకా ఐదు కార్లను వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ల ద్వారా కార్లను దొంగిలించి, ఓ రిపెయిర్‌ షాప్‌కి ఆ కార్లను తరలించి, వాటిని అక్కడ డిస్‌మాండిల్‌ చేసి, విడిభాగాల్ని విక్రయిస్తున్నట్లు వవరించారు పోలీసు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి కార్లను దొంగిలించినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com