నేను..శైలజ...

- December 06, 2015 , by Maagulf
నేను..శైలజ...

నేను..శైలజ... మా ప్రేమకథరామ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'నేను... శైలజ'. కిషోర్‌ తిరుమల దర్శకుడు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో రామ్‌ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''ప్రేమకథని కథానాయకుడి కోణంలో చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులకి తేలిగ్గా అర్థమవుతుందని 'నేను.. శైలజ' అనే పేరు పెట్టాం. ఇందులో పబ్‌లో పనిచేసే డీజేగా నటిస్తున్నా. వాస్తవిక ధోరణిలో సాగుతుంది. ఇలాంటి పాత్ర చేయడం కొంచెం కష్టమే'' అన్నారు. దర్శకుడు చెబుతూ ''నా నిజజీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకుని అల్లిన ప్రేమకథ ఇది. ఈ సినిమా చూస్తూ ఎవరి జీవితాల్ని వాళ్లు తెరపై చూసుకొంటుంటారు. దేవిశ్రీప్రసాద్‌ మంచి బాణీలను అందించార''న్నారు. నిర్మాత చెబుతూ ''కుటుంబ విలువలు, సహజత్వం ఉట్టిపడుతూ సాగే చక్కని ప్రేమకథ. ఈ నెల 12న పాటల్ని, జనవరి 1న సినిమాని విడుదల చేస్తామ''న్నారు. సత్యరాజ్‌, నరేష్‌, ప్రిన్స్‌, కృష్ణభగవాన్‌, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌. సమర్పణ: కృష్ణ చైతన్య

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com