కంప్యూటర్ల ముందు ఉద్యోగం... ఎక్కడబడితే అక్కడ కొవ్వు... ఏం చేయాలి?
- May 04, 2018
ఈరోజులలో చాలామంది ఉద్యోగాలలో బీజీగా ఉంటున్నారు. కనుక వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకునే సమయం దొరకటం లేదు. వీరు కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం ఉండటం లేదు. దీని కారణంగా శరీరంలో ఎక్కడపడితే అక్కడ కొవ్వు పేరుకుపోతుంది
ముఖ్యంగా పొట్ట, పిరుదలు, తొడలు, ముఖం ఈ భాగాలలో కొవ్వుశాతం ఎక్కువుగా ఉంటుంది. ముఖంలో కొవ్వు పేరుకుంటే ముఖం ఉబ్బుగా, వికారంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు బాపూబొమ్మలాగా , అందంగా ఉండాలని కలలు కంటూ ఉంటారు. కనుక వీరు ముఖంలో పేరుకొనిన కొవ్వు తగ్గించుకోవటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సిందే. అవి ఏమిటో చూద్దాం...
1. మనం తీసుకునే ఆహారంలో కెలోరీలు లేకుండా చూసుకోవాలి. రోజుకి 2 గ్రాములకు మించి ఉప్పు తినకూడదు.
2. క్యాల్షియం, ప్రోటీన్స్ ఎక్కువుగా ఉన్న ఆహారం తినాలి. ఈ క్యాల్షియం ముఖంలో అదనంగా ఉన్న నీటిని బయటకు పంపించి ముఖం పలుచగా ఉండేలా చేస్తుంది. కనుక రోజుకి 4 లీటర్ల నీటిని త్రాగటం మంచిది.
3. మునివేళ్లతో చెంపల అడుగు నుంచి పైకి చర్మాన్ని లిప్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం సాగినట్టుగా ఉండదు. వీటితో పాటు కళ్లను గుండ్రంగా తిప్పడం, నాలుకని వీలైనంత బయటకు తీయడం వంటివి కూడా ముఖంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి.
4. రోజు బుడగలను ఊది దానిలోని గాలిని వదిలేస్తూ ఉండాలి. ఇలా ఐదారుసార్లు చేయడం వల్ల బుగ్గలకు మంచి నిగారింపు వచ్చి ముఖంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది.
5. రేగు ఆకుల్ని మెత్తగా దంచి గ్లాసుడు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం త్రాగటం వల్ల ముఖంలో పేరుకున్న అదనపు కొవ్వు తొలగిపోతుంది.
6. ముడి నువ్వుల నూనెను 2 టీ స్పూన్ల చొప్పున తీసుకొని రోజు పుక్కిలించుట వలన మంచి ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







