దుబాయ్‌:4 లేన్ల టన్నెల్‌ని ప్రారంభించిన ఆర్‌టిఎ

- May 05, 2018 , by Maagulf
దుబాయ్‌:4 లేన్ల టన్నెల్‌ని ప్రారంభించిన ఆర్‌టిఎ

దుబాయ్‌:రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, దుబాయ్‌లోని షేక్‌ రషీద్‌ స్ట్రీట్‌పై నాలుగు లేన్ల టన్నెల్‌ని ప్రారంభించింది. షేక్‌ రషీద్‌, షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ స్ట్రీట్స్‌ ఇంటర్‌సెక్షన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మించారు. షేక్‌ రషీద్‌ స్ట్రీట్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద అల్‌ సిందఘా నార్త్‌ వార్డ్‌ వైపుగా ఈ ప్రాజెక్ట్‌ని ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ ప్రారంభంతో ఈ మార్గంలో రాకపోకలు మరింత సులవవుతాయని అధికారులు చెబుతున్నారు. గత ఫిబ్రవరిలో రెండు ముఖ్యమైన బ్రిడ్జిలను ప్రారంభించడం జరిగింది. షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ స్ట్రీట్‌పై రెండు లేన్లతో కూడిన బ్రిడ్జి ఒకటి కాగా, రెండోది ఒక లేన్‌ బ్రిడ్జిని షేక్‌ రషీదా స్ట్రీట్‌ వైపుగా జబీల్‌ స్ట్రీట్‌ నుంచి వెళ్ళే మార్గంలో ఏర్పాటు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com