టీటీడీపై లేఖను ఉపసంహరించుకున్న పురావస్తు శాఖ!

- May 05, 2018 , by Maagulf
టీటీడీపై లేఖను ఉపసంహరించుకున్న పురావస్తు శాఖ!

తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తమ పరిధిలోకి రావాలని పురావస్తు శాఖ రాసిన లేఖ కలకలం సృష్టించింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఇటు అధికారులు, అటు భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. చివరకు ఆ లేఖను పురావస్తు శాఖ ఉపసంహరించుకుంది. దీంతో టీటీడీ ఊపిరి పీల్చుకుంది. పురావస్తు శాఖ నుంచి వచ్చిన లేఖపై భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తిరిగి ఉపసహరించుకున్నారని ఈవో సింఘాల్‌ వివరణ ఇచ్చారు.

అయితే కేంద్రం ప్రస్తుత జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తన పరిధిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంటుంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి.. విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆదేశాల మేరకు టీటీడీకి అమరావతి సర్కిల్‌ ఆ లేఖను పంపింది.

తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని ఇటీవల తమకు పలు ఫిర్యాదులు అందాయని పురావస్తు శాఖ చెబుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలు సరిగా భద్రపరచడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని కేంద్ర భావిస్తోంది. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత కేంద్ర అధికారులు సందర్శించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ లేఖను ఉపసంహరించిందని చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com