ఎంఐటీ కి సలదారునిగా హీరో అజిత్.!
- May 05, 2018
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతగొప్ప పేరు సంపాదించిన హీరో అజిత్ కుమార్. తెలుగు వాడైన అజిత్ కుమార్ తెలంగాణాలోని సికింద్రాబాబ్ లో పుట్టి పెరిగాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.
స్టార్ హీరో అజిత్‌కి సినిమాలపైనే కాకుండా బైక్, కారు రేస్, ఫోటోగ్రఫీపై ఎక్కువ ఇంట్రెస్ట్. కొన్ని రోజులుగా ఆయన చిన్న విమానాలు, హెలికాఫ్టర్స్ని తయారుచేస్తున్నారు. రీసెంట్గా డ్రోన్ల తయారీపై కూడా కాన్సన్ట్రేషన్ చేశాడు. ఇటీవల దీనిపై అధ్యయనం చేయడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి వెళ్లి అక్కడి విద్యార్థులతోనూ ముచ్చటించారు.
కాగా అజిత్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో తనదైన ప్రతిభ చూపిస్తున్నారు. కాగా, అజిత్ లోని ప్రతిభని గుర్తించిన ఎంఐటీ ఆయనని 'హెలికాప్టర్ టెస్ట్ ఫైలట్ అండ్ యూఏవీ సిస్టం' సలహాదారుడిగా నియమించింది. ఇలాంటి అరుదైన గుర్తింపును తెచ్చుకున్న తొలి నటుడు అజిత్ కావడం విశేషం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..