టీటీడీపై లేఖను ఉపసంహరించుకున్న పురావస్తు శాఖ!
- May 05, 2018
తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తమ పరిధిలోకి రావాలని పురావస్తు శాఖ రాసిన లేఖ కలకలం సృష్టించింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఇటు అధికారులు, అటు భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. చివరకు ఆ లేఖను పురావస్తు శాఖ ఉపసంహరించుకుంది. దీంతో టీటీడీ ఊపిరి పీల్చుకుంది. పురావస్తు శాఖ నుంచి వచ్చిన లేఖపై భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తిరిగి ఉపసహరించుకున్నారని ఈవో సింఘాల్ వివరణ ఇచ్చారు.
అయితే కేంద్రం ప్రస్తుత జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తన పరిధిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంటుంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి.. విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆదేశాల మేరకు టీటీడీకి అమరావతి సర్కిల్ ఆ లేఖను పంపింది.
తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని ఇటీవల తమకు పలు ఫిర్యాదులు అందాయని పురావస్తు శాఖ చెబుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలు సరిగా భద్రపరచడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని కేంద్ర భావిస్తోంది. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత కేంద్ర అధికారులు సందర్శించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ లేఖను ఉపసంహరించిందని చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..