దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ

- May 06, 2018 , by Maagulf
దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ

దర్శకరత్న దాసరి నారాయణరావు బర్త్ డేని డైరెక్టర్స్ రోజుగా నిర్ణయించడం ఎంతో సంతోషంగా వుందన్నారు నటుడు బాలకృష్ణ. దాసరి జయంతి సందర్భంగా శుక్రవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఛాంబర్ ఆవరణలో నిలువెత్తు దాసరి విగ్రహాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.. దాసరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దాసరి.. తలలో నాలుకలా ఉంటూ ఇండస్ట్రీ కష్టాలను తన కుటుంబ కష్టాలుగా భావించి వాటిని తన భుజాలపై మోసి పరిష్కరించారని కొనియాడారు. జాతీయ, ఫిల్మ్‌ఫేర్‌, నంది అవార్డులు ఇలా ఎన్నో వచ్చాయికానీ, ఆ అవార్డులన్నీ ఆయన ముందు దిగదుడుపే అని తెలియజేశారు.

ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తని, దాసరి డైరెక్షన్‌లో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నానని తెలిపిన బాలకృష్ణ.. ఆయన 150వ చిత్రం 'పరమవీర చక్ర' ఫిల్మ్‌లో అనుకోకుండా నటించానని తెలిపారు. 'శివరంజని' చిత్రానికి హీరోగా తనను తీసుకోవాలని భావించి ఎన్టీఆర్‌ని దాసరి అడిగారని, బాబు చదువు తర్వాత చేయవచ్చన్న విషయాన్ని గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com