టర్కీలో భయానక వాతావరణం...

- May 06, 2018 , by Maagulf
టర్కీలో భయానక వాతావరణం...

చినుకుపడితే చిగురుటాకులా వణికిపోవడం నేటి మహానగరాల వంతవుతోంది... మనదేశంలోనే కాదు విదేశాలు కూడా దీనికేమీ తీసిపోవని స్పష్టమైంది... టర్కీ రాజధాని అంకారాలో చిన్నపాటిగా మొదలైన వర్షం కుండపోతగా మారి బీభత్సం సృష్టించింది. దీంతో వరద పోటెత్తి నదులు, కాలువలు ఉధృతంగా పొంగిపొర్లాయి... రహదారులు కాస్తా వాగులుగా మారి కార్లు కొట్టుకుపోయాయి...

ఒకటి కాదు రెండు కాదు వందలకొద్ది కార్లు, ట్రక్కులు భీకర వరదకు కొట్టుకుపోయాయి. వరద ఉధృతిలో చిక్కుకున్న ఓ వ్యక్తి కారు పైకి ఎక్కాడు... మిగతా కార్లన్నీ అతని కారును ఢీకొట్టి వెళ్తున్నా ధైర్యంతో కూర్చున్నాడు... దీంతో అతనికి ప్రమాదం తప్పింది... 

టర్కీలో ఒక్కసారిగా భయానక వాతావరణం సృష్టించిన వరదల్లో పలువురు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు.  వరదలకు దాదాపు 160 కార్లు, 25 దుకాణాలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచానా వేశారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు వేగంగా జరుగుతున్నాయి...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com