చిన్నారుల చేతికి బ్యాండ్లు వేయడం ప్రమాదకరం....

- May 06, 2018 , by Maagulf
చిన్నారుల చేతికి బ్యాండ్లు వేయడం ప్రమాదకరం....

చైనా:చైనాకు చెందిన లేలే అనే నాలుగేళ్ల చిన్నారికి ఎదురైన సమస్య కలలో కూడా ఎవరూ ఊహించలేరు. ఈ చిన్నారి చేతికి దీర్ఘకాలంగా రిస్ట్ బ్యాండ్ ఉంది. అది మెల్లమెల్లగా చర్మంలో కలిసిపోతూ వచ్చింది. ఒక రోజు చిన్నారి నాన్నమ్మ లేలే చేయి వాచిపోయి ఉండటాన్నిగమనించి ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వారు ఆపరేషన్ చేసి పాప చర్మంలోకి చొచ్చుకు పోయిన రిస్ట్ బ్యాండ్‌ను బయటకు తీయగలిగారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పిల్లలకు మూడు సంవత్సరాలు వచ్చే వరకూ ఎలాంటి రిస్ట్ బ్యాండ్‌లు వేయవద్దని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com