తెలంగాణ:హృదయ విదారక ఘటన..
- May 06, 2018
తెలంగాణ:అల్లారు ముద్దుగా చూసుకున్న కుమార్తె మరణించిందని భార్య భర్తలు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో కుమారుడు అనాధ అయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సందీప్ (31) పూజ(26) భార్య భర్తలు వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. సందీప్ ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చాడు. తిరిగి ఫ్యామిలీని తీసుకుని గల్ఫ్ వెళ్లాలనుకునే సమయానికి కుమార్తె అనారోగ్యంతో మరణించింది. దీంతో భార్య భర్తలిద్దరూ విషాదంలో మునిగిపోయారు. కుమార్తె మరణాన్ని జీర్నచుకోలేని సందీప్, పూజ అప్పటినుంచి ఎవ్వరు చెప్పిన వినకుండా కుమార్తె సమాధి వద్దకు వెళ్లి ఏడ్చేవారు. ఈ క్రమంలో అన్నంతినడం మానేయడంతో అస్వస్థకు గురయ్యారు. వీరిని ఇలాగె వదిలేస్తే ఏమైపోతారోనన్న బెంగతో సందీప్ బంధువు ఒకరు వారిని తన ఇంటికి రమ్మని కోరాడు. అయితే బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి తలుపులు వేసుకున్నారు దంపతులు. వారిద్దరూ ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపు తెరిచాడు బంధువు. లోపల సందీప్, పూజ లిద్దరు వురికి వేలాడుతూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో షాక్ కు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుమార్తె మృతి చెందిందన్నబాధతో వారు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. కాగా దంపతుల మరణంతో కుమారుడు అనాధగా మారాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







