ఈ నెల 13న సినీ గోయర్స్‌ పురస్కారాలు

- May 06, 2018 , by Maagulf
ఈ నెల 13న సినీ గోయర్స్‌ పురస్కారాలు

తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించిన వారికి సినీ గోయర్స్‌ అసోసియేషన్‌ ఈనెల 13వ తేదీన పురస్కారాలు అందిస్తున్నట్టు ఆ సంఘం జనరల్‌ సెక్రటరీ బి.రామకృష్ణ తెలిపారు. 2017 సంవత్సరానికి గాను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు 49వ సినీ గోయర్స్‌ అవార్డుల్ని హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌, తెలుగు లలిత కళాతోరణంలో ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు శోభన్‌ బాబు రోలింగ్‌ షీల్డ్‌ పేరిట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడికి ఇచ్చే అవార్డునూ అదే వేదికపై ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్‌ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌, సీనియర్‌ పాత్రికేయులు వరదరాజు, నటి అనూష తదితరులు పాల్గొన్నారు. సెక్రెటరీ రామక ష్ణ మాట్లాడుతూ 'సినీగోయర్స్‌ 49వ అవార్డ్స్‌ ఫంక్షన్‌ చేయడం అంటే అంత సులువు కాదు. అప్పట్లో బ్యాలెట్‌ బాక్సుల్లో నామినేషన్‌ వేసి అవార్డులకు ఎంపిక చేసేవాళ్ళం. చాలా జెన్యూన్‌గా ఇస్తున్నాం. మనిఫూలేషన్‌కి అవకాశం లేదు.

మేము అవార్డ్స్‌ ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మా నాన్న గారు మొదలుపెట్టారు. ఆయన తర్వాత నేను కొనసాగిస్తున్నా. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఈ అవార్డ్స్‌ ఇస్తుంటాం.

తెలంగాణ టూరిజం, డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌ ఎండ్‌ కల్చర్‌, తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో నిర్వహిస్తున్నాం' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com