ఒమన్‌లో రమదాన్ 'తొలి రోజు'పై ప్రకటన
- May 06, 2018
మస్కట్: ఒమన్‌లో రమదాన్ తొలి రోజును ప్రకటించారు. మే 17న పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం కాబోతోంది. మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు రెలిజియస్ ఎఫైర్స్ - న్యూ మూన్ సైటింగ్ మెయిన్ కమిటీ, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మే 16 అంటే బుధవారం 1439 హెచ్ షబాన్ 30 కావడంతో, మే 17 అంటే గురువారం పవిత్ర రమదాన్ మాస్ తొలిరోజు (1439 హెచ్ ఏడాదికి గాను) అని ఆ ప్రకటనలో పేర్కొంది. సుల్తానేట్‌లో మంగళవారం అంటే మే 15న చంద్రుడ్ని చూసే అవకాశం లేదు. దాంతో, రమదాన్ గురువారం ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో హిజ్ మెజెస్టీ సుల్తాన్ కబూస్ బిన్ సైద్‌కి మినిస్ట్రీ అభినందనలు తెలిపింది. ఒమనీ పీపుల్ అలాగే ఇస్లామిక్ ఉమ్మాహ్‌లకూ అభినందనలు తెలిపింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..