పేలిన అగ్ని పర్వతం..తగలబడ్డ ఇళ్లు
- May 06, 2018
హవాయిలో పేలిన అగ్ని పర్వతం.. జనాన్ని టెన్షన్ పెడుతూనే ఉంది. అగ్ని పర్వతం నుంచి ఉప్పొంగుతున్న లావా.. అడవులను.. రోడ్లను.. ఇళ్లను ముంచేస్తోంది. అగ్ని పర్వతం పేలుడుతో.. భూకంపాలూ వస్తున్నాయి. రోడ్లు బీటలు వారాయి.. వాతావరణంలో విషవాయువులు నిండిపోతున్నాయి. పరిస్థితి అదుపుతప్పడంతో.. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది. ఎగసిపడుతున్న లావా కారణంగా.. ఇప్పటికే 9 ఇళ్లు పూర్తిగా తగలబడ్డాయి. వేలాది ఎకరాల్లోని అడవి కాలి బూడిదైపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని రోజుల పాటు లావా ఇలానే వెలువడే అవకాశం ఉండడంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది యూఎస్ జియోలాజికల్ సర్వే. పేలుడు తీవ్రతకు దాదాపు 16 కిలోమీటర్ల వరకూ మాగ్మా వ్యాపించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..