ఇంత అవమానిస్తారా? ఆవేదనతో ట్వీట్ చేసిన అద్నాన్

- May 07, 2018 , by Maagulf
ఇంత అవమానిస్తారా? ఆవేదనతో ట్వీట్ చేసిన అద్నాన్

విదేశాల్లో భారత సెలబ్రిటీలపై ఎయిర్ పోర్టుల్లో జరుగుతున్న సంఘటనలపై మనమూ తరచూ వింటున్నాం. చూస్తున్నాం. తాజాగా పాప్ సింగర్ అద్నాన్ శామీకి కూడా ఇటువంటి ఘోర పరాభావమే ఎదురైంది. దీంతో కలత చెందిన శమీ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో జరిగిన సంఘటనలను ప్రస్తావించారు. తన టీంను కువైట్ ఎయిర్ పోర్టు ఇమిగ్రేషన్ సిబ్బంది అసభ్య పదజాలంతో తిట్టారని పేర్కొన్నారు.

ప్రముఖ పాప్ సింగర్ అద్నాన్ శామీ తన సిబ్బందిని ఇబ్బందులకు గురి చేసినట్లు, కువైట్ విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తన సిబ్బందిని "ఇండియన్ డాగ్స్" గా పిలిచారని ఆరోపించారు.

ఓ లైవ్ షో కోసం కువైట్ కు వెళ్లిన అద్నాన్ సామీ, కువైట్ విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ గర్వంగా ప్రవర్తించిందని, ఎటువంటి కారణం లేకుండా తన సిబ్బందిని అవమానాలకు గురిచేసినట్లు పేర్కొన్నారు. కువైట్ విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఏ కారణం లేకుండా నా సిబ్బందిని అవమానాలకు గురి చేసిందని, 'ఇండియన్ డాగ్స్' అని పిలిచారని కువైట్ భారత రాయబార కార్యాలయానికి రాసిన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 'మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరు ఏమీ చేయలేదు. కువైటర్లకి ఎంత అహంకారం' అని మిస్టర్ సామీ కువైట్లోని భారత రాయబార కార్యాలయానికి ట్వీట్ చేశాడు. తరువాత కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్లను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

అద్నాన్ సామీ లండన్‌లో పుట్టాడు. పాకిస్తాన్ పాస్ పోర్టు గడువు ముగియడంతో 2015లో భారత ప్రభుత్వానికి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. భారత ప్రభుత్వం అతని దరఖాస్తును పరిశీలించి భారత పౌరసత్వం ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com