కృష్ణస్వామి కుటుంబాన్ని ఆదుకుంటా:హీరో విశాల్

- May 07, 2018 , by Maagulf
కృష్ణస్వామి కుటుంబాన్ని ఆదుకుంటా:హీరో విశాల్

నీట్ పరీక్ష నేపథ్యంలో కూతురిని వదిలిపెట్టడానికి వెళ్లిన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. చెన్నైకి చెందిన కృష్ణసామి కుమార్తె కస్తూరి మహాలింగం ఆదివారం కేరళలో నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో శనివారం రాత్రీ కేరళలోని ఓ హోటల్ కు చేరుకున్నారు. అయితే ఉన్నట్టుండి  కృష్ణసామి గుండె పోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్లక ముందు అతను మరణించాడు. ఇక కృష్ణస్వామి మృతిపట్ల  నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి , నటుడు విశాల్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణసామి కుమార్తె కస్తూరి మహాలింగం ను పరామర్శించి. దైర్యం చెప్పారు. కృష్ణస్వామి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com