విజయవాడలో 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం

- May 07, 2018 , by Maagulf
విజయవాడలో 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరుగుతోంది. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మూడు అంశాలపై తీర్మానం చేసి రాష్ట్రపతికి ఆర్థికమంత్రులు పంపనున్నారు. గత నెల 10న కేరళలోని తిరువనంతపురంలో మొదటి సమావేశం జరిగింది. ఇప్పుడు విజయవాడ సమావేశానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకాగా.. 5 మంది ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు..

 హేతు బద్ధతలేని విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్ని ఇబ్బందులున్నా వాటిని అవకాశాలుగా మలచుకున్నామని ఆర్థిక మంత్రుల సమావేశంలో చెప్పారు చంద్రబాబు. వృద్ధి రేటును పెంచుకుంటూ పోతున్నామని వివరించారు. ఎఫ్‌ఆర్‌బీఎంను కుదించాలన్న కేంద్రం ఆలోచన సరికాదని చంద్రబాబు మండిపడ్డారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com