రష్యాలో ర్యాలీలపై పోలీసుల అణచివేత చర్యలు

- May 07, 2018 , by Maagulf
రష్యాలో ర్యాలీలపై పోలీసుల అణచివేత చర్యలు

బ్రస్సెల్స్‌ : రష్యాలో అనధికార ప్రతిపక్ష ర్యాలీపై పోలీసులు హింసకు దిగడాన్ని ఇయు ఒక ప్రకటనలో ఖండించింది. వేయి మందికి పైగా ప్రదర్శనకారులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై రష్యా అధికారులు హింసకు పాల్పడడం చూస్తుంటే మౌలిక భావ వ్యక్తీకరణా స్వేచ్ఛకు ముప్పు వున్నట్లు తేలుతోందని యురోపియన్‌ యూనియన్‌ పేర్కొంది. దీనికి ఏడు మాసాలు ముందుగా కెటలోనియాలో శాంతియుతంగా జరిగిన నిరసనలు, ఆందోళనలపై పోలీసులు దారుణంగా వ్యహరించడం, వాటిని అణచివేయడానికి చర్యలు తీసుకున్నపుడు ఇయు భిన్నంగా స్పందించింది. ఆ సమయంలో అధికార యంత్రాంగాన్ని సమర్ధించిన ఇయు ఇప్పుడు పోలీసుల చర్యలను నిరసించింది. అయితే రష్యావ్యాప్తంగా చోటు చేసుకున్న ఈ ప్రదర్శనల్లో పలు నగరాల్లో జరిగిన వాటికి అధికారుల అనుమతి లేదని తెలుస్తోంది. అయినా ప్రదర్శకులపై పోలీసుల దారుణ చర్యలు, పెద్ద సంఖ్యలో ప్రదర్శకులను అరెస్టు చేయడాన్ని ఖండించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com