రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి పుతిన్ ప్రమాణం
- May 07, 2018
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రమాణం చేశారు. దేశాధ్యక్షుడిగా ఆయన నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. మరో ఆరేండ్ల పాటు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ కార్యాలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పుతిన్ ప్రమాణం కోసం జార్జీవ్స్కై, అలెగ్జాండ్రోస్కై, ఆండ్రీవ్స్కై అనే మూడు భవనాలను ప్రత్యేక ఆకర్షణగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధ్యక్ష కార్యాలయం ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సభ్యులు, దౌత్యవేత్తలు తదితరులు హాజరయ్యారు. గార్డ్స్ కవాతు నిర్వహించి పుతిన్‌ను సాదరంగా పోడియం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి పుతిన్ మాట్లాడారు. ' దేశ ప్రజలు నాపై ప్రగాఢ విశ్వాసాన్ని ఉంచి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. రష్యన్ల వర్తమానం, భవిష్యత్‌కు అవసరమైన అభివృద్ధి కార్యాచరణ రూపొందిస్తాను. వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తాను. ప్రతీ ఒక్క కుటుంబం సుఖసంతో షాలతో మెలిగేలా చూస్తాను. మాతృభూమి కోసం, దేశ ప్రజల కోసమే నేను పునరంకితమౌతాను. అన్ని సవాళ్లను అధిగమిస్తా. ప్రపంచ దేశాల్లో రష్యాను అగ్రభాగంలో నిలిపేందుకు కృషి చేస్తాను' అని పుతిన్ అన్నారు. కాగా, రష్యాలో మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పుతిన్‌కు 76శాతం ఓట్లు నమోదయ్యాయి. కమ్యూనిస్ట్ పార్టీ నేత పావెల్ గ్రూదినిన్కు 11.8శాతం ఓట్లు, వ్లాదిమిర్ జిరినోవ్స్కీకు 5.6శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో పుతిన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. రష్యా ప్రధాని బాధ్యతలు డీమిత్రీ మెద్వేదేవ్కు పుతిన్ అప్పగించనున్నట్టు క్రెమ్లిన్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..