మోహన్ లాల్ తో నాగార్జున!
- May 08, 2018
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా 'విక్రమ్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున...తర్వాత రొమాంటిక్ చిత్రాలతో అమ్మాకుల మన్మధుడిగా మారిపోయాడు. ఆ తర్వాత కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు నాట గత మూడు దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు అక్కినేని నాగార్జున. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా.. హిందీ, తమిళ చిత్రాల్లోనూ సందడి చేశారు. బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే ఇప్పటి వరకు నాగార్జున్ మళియాళ ఇండస్ట్రీలో కనిపించలేదు.
తాజాగా అక్కడ కూడా తన సత్తా చాటబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ రూపొందించనున్న చిత్రం 'మరక్కర్: అరబికడలింతే సింహం'. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం నాగార్జునను సంప్రదించినట్లు టాక్. అయితే తన పాత్ర, కథ ఎంతో నచ్చడంతో నాగ్ కూడా ఈ సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
ఒక వేళ నాగ్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే.. ఆయన నటించే తొలి మలయాళ చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే నాగ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ఈ మద్య మళియాళ హీరోలు తెలుగు తెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మాళీవుడ్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ చిత్రం 'నా పేరు సూర్య' మాళీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.
ఇక నాగార్జున నటించబోయే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి నటించనున్నారు. అంతేగాకుండా.. 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' చిత్రాల సినిమాటోగ్రాఫర్ తిరు ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందించనున్నారు. అలాగే.. 'బాహుబలి' మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేసిన సాబు సైరిల్ ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. నవంబర్ 1 నుంచి సెట్స్ పైకి వెళ్ళే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







