దుబాయ్‌:ఫేక్‌ డాలర్స్‌, 20 నిమిషాల్లో నిందితుడి పట్టివేత

- May 08, 2018 , by Maagulf
దుబాయ్‌:ఫేక్‌ డాలర్స్‌, 20 నిమిషాల్లో నిందితుడి పట్టివేత

దుబాయ్‌:దుబాయ్‌ పోలీసులు, ఆఫ్రికాకి చెందిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఫేక్‌ యూఎస్‌ డాలర్స్‌ని నిందితుడు విక్రయిస్తున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆఫ్రికాకి చెందిన వ్యక్తి ఒకరు తనకు 100,000 డాలర్లు ఇచ్చాడనీ, అయితే అవి ఫేక్‌గా తాను గుర్తించానని పోలీసులకు బాధితుడు తెలిపాడు. డాలర్లను విక్రయించిన వెంటనే కారులో వేగంగా నిందితుడు వెళ్ళిపోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడని దుబాయ్‌ పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ డైరెక్టర్‌ కల్నల్‌ టుర్కి బిన్‌ ఫారిస్‌ వివరించారు. పోలీస్‌ టీమ్‌, బాధితుడ్ని లొకేషన్‌ అడిగి, కార్‌ నెంబర్‌ తెలుసుకుని, అత్యంత చాకచక్యంగా నిందితుడి& అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 200,000 ఫేక్‌ డాలర్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీపీఎస్‌ ద్వారా లొకేషన్‌ని పోలీసులు ట్రాక్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com