రోడ్లపై లావా ప్రవహిస్తోంది..
- May 08, 2018
అమెరికాలోని కిలావుయే అగ్నిపర్వతం బద్దలై రోడ్లపై లావా ప్రవహిస్తోంది. హవాయి దీవుల్లోని పైనా టౌన్‌లోని రోడ్లపై ప్రవహిస్తున్న లావా ఇళ్లను, ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కార్లను క్షణాల్లో మింగేస్తుంది. ఉబికి వస్తున్న లావా కారణంగా ఇప్పటికే 31 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 200 అడుగుల ఎత్తున ఎగసి పడుతున్న లావాను అడ్డుకోవడం అధికారులకు కష్టంగా మారుతోంది. ప్రజలను అప్రమత్తం చేసేదిశగా యంత్రాంగం తక్షణ చర్యలు చేపడుతోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లైలానీ ఎస్టేట్ ప్రాంతంపై లావా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కిలావుయే అగ్ని పర్వతం చుట్టూ3,87,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమి పగుళ్లు ఇచ్చిందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పగుళ్లనుంచి రాళ్లు, విషవాయువులు, నీటి ఆవిరి ఎగసిపడుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..