అమర్నాథ్ యాత్రలో విషాదం
- May 08, 2018
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుఫాన్ కారణంగా ముగ్గురు మృతి చెందారు.ముంబయికి చెందిన 52 ఏళ్ల సుధామా సింగ్, న్యూఢిల్లీకి చెందిన జానకీ దేవి మృతదేహాలు నేపాల్ సరిహద్దుల్లోని ఆకాష్ వద్ద లభించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరకాశిలోని కేదార్టాల సమీపంలో ఒక ప్రాంతంలో చిక్కుకున్న ఓ కూలీ మరణించారు. భారీ హిమపాతంతో అమర్నాథ్ పుణ్యకేత్రానికి సందర్శిచడానికి వెళ్లిన మాజీ సిఎం హరీష్ రావత్, రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ తమ్టాతో కేథారీనాథ్, యమునోత్రి ఆలయాల్లో చిక్కుకోగా, అనేక మంది పలు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మంగేష్ గిల్డియల్ మాట్లాడుతూ యాత్రికులకు రాష్ట్ర విపత్తు స్పందన ఫండ్, స్థానిక పోలీసులు, పరిపాలన నుండి స్వచ్ఛంద సేవకులు సహాయపడుతున్నారన్నారు. బద్రీనాథ్‌లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీకాకుళం వాసులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం క్షేమంగా తరలించిందని జెడ్పిటిసి శ్రీదేవి మధు బాబులు ప్రజాశక్తికి తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..