ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నాం

- May 08, 2018 , by Maagulf
ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నాం

ఇరాన్‌తో 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ డీల్ లోపభూయిష్టమైనదని, కాలం చెల్లినదని వ్యాఖ్యానించారు. అమెరికా పౌరుడిగా ఈ ఒప్పందం తనకు నగుబాటు అని చెప్పారు.

ఇరాన్ ఒప్పందం నుంచి తప్పుకోవద్దన్న యూరప్‌లోని అమెరికా మిత్రదేశాల సలహాను పక్కనబెడుతూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. అణు ఒప్పందం కుదిరినప్పుడు ఇరాన్‌పై ఎత్తివేసిన ఆర్థిక ఆంక్షలను తిరిగి విధిస్తానని ఆయన చెప్పారు.

ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ వెంటనే స్పందించింది.

ఒప్పందం రూపంలో అమెరికా తమకు మాట ఇచ్చిందని, తాజా నిర్ణయంతో ఈ మాటను అమెరికా తప్పుతోందని ఇరాన్ వ్యాఖ్యానించింది.

అవసరమైతే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు.

అణు ఇంధనంతోపాటు అణ్వాయుధాల తయారీకి యురేనియం శుద్ధి కీలకం.

అణు ఒప్పందంలో భాగస్వాములైన తమ మిత్రదేశాలు, ఇతర దేశాలతో చర్చిస్తామని, వాటి సహకారంతో ఒప్పందం లక్ష్యాలు నెరవేరే పక్షంలో ఒప్పందంలో కొనసాగుతామని రౌహానీ చెప్పారు. కొన్ని వారాల్లో ఈ చర్చలు జరుపుతామని, ఆ తర్వాత ఒప్పందంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

'జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్(జేసీపీవోఏ)'గా వ్యవహరించే ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నప్పుడు కుదిరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com