ఆర్చర్ జ్యోతి సురేఖ, కోచ్ మధ్య మరో వివాదం
- May 08, 2018
అంతర్జాతీయ ఆర్చర్ జ్యోతి సురేఖ నగదు బహుమానంపై శాప్ జారీ చేసిన జీవో వివాదం సద్దుమణిగిన వెంటనే తాజాగా మరోవివాదం తెరమీదికొచ్చింది. జ్యోతిసురేఖ గురు ద్రోహం చేసిందంటూ చీఫ్ కోచ్ సత్యనారాయణ, ఆయన సతీమణి నిరసన దీక్ష చేపట్టారు. దీంతో అర్చరి క్రీడాకారణి వివాదం మరింత ముదురుతోంది.
అర్జున అవార్డు గ్రహీత, ఆర్చర్ జ్యోతి సురేఖ, కోచ్ సత్యనారాయణ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. జ్యోతి గురు ద్రోహం చేసిందంటూ గుణదల శ్మశాన వాటికలో తన కుమారుడి సమాధి వద్ద కోచ్ సత్యనారాయణ నిరాహార దీక్ష చేపట్టారు. 2007 నుంచి 2013 వరకూ జ్యోతి తన వద్దే కోచింగ్ తీసుకుందని ఆయన చెప్తున్నారు. జ్యోతి సురేఖ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జ్యోతిసురేఖను తాను ఎప్పుడు15 లక్షల రూపాయలు అడగలేదని అన్నారు. తమ పేరు చెప్పి.. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్లకు రావాల్సిన డబ్బు తీసుకున్నారని, ఆమె శిక్షణ తీసుకుంది తమ వోల్గా ఆర్చరీ సెంటర్‌లోనేనని ఆయన తెలిపారు.
ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకి కోచ్‌కి మధ్య వివాదంలో ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధికారులతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ జ్యోతి సురేఖ ఆసహనం వ్యక్తం చేశారు. తనకు ప్రకటించిన కోటి రూపాయల నజరానాలో కొంత వాటాను కోచ్‌కు ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టారు. దీనికి నిరసనగా తన ఇంటిలో దీక్షకు దిగుతానన్నారు. దీంతో ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్, సాప్ డైరెక్టర్ అంకమ్మ చౌదరిలు చర్చలు జరిపారు. కోచ్‌కు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ను కూడా సురేఖకే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వివాదం సద్దుమణుగుతోంది అనుకుంటున్న లోపే, కోచ్ సత్యనారాయణ,ఆయన భార్య దీక్షకు దిగడంతో గొడవ మరింత ముదిరినట్టయ్యింది. అయితే సత్యనారాయణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా అయన్నుఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







