2 హౌతీ మిసైల్స్‌ని ఇంటర్‌సెప్ట్‌ చేసిన సౌదీ

- May 09, 2018 , by Maagulf
2 హౌతీ మిసైల్స్‌ని ఇంటర్‌సెప్ట్‌ చేసిన సౌదీ

సౌదీ అరేబియా:సౌదీ అరేబియా ఎయిర్‌ డిఫెన్స్‌, రెండు బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ని కూల్చేయడం జరిగింది. హౌతీ తీవ్రవాదులు వీటిని సౌదీ వైపు సంధించినట్లు సౌదీ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వర్గాలు వెల్లడించాయి. సాదా గవర్నరేట్‌ నుంచి సౌదీ అరేబియా వైపు ఈ మిస్సైల్స్‌ దూసుకొచ్చాయి. కోలిషన్‌ ఫోర్సెస్‌ అధికార ప్రతినిథి కల్నల్‌ టుర్కి అల్‌ మాల్కి మాట్లాడుతూ, ఇరాన్‌ మద్దతుతో హౌతీ మిలిటెంట్స్‌ సౌదీ వైపు మిస్సైల్స్‌ సంధిస్తూనే వున్నారని చెప్పారు. జజాన్‌ ప్రాంతంలో జనసమ్మర్థం ఎక్కువగా వుండే ప్రాంతాలే లక్ష్యంగా మిస్సైల్‌సని పేల్చారు హౌతీ తీవ్రవాదులు. ఇటీవలి కాలంలో యెమెన్‌లోని హౌతీ తీవ్రవాదులు మరింత విరివిగా మిస్సైల్స్‌న ఇవినియోగిస్తున్నట్లు అల్‌ మల్కి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com