ఫ్లిప్ కార్ట్ ను దక్కించుకున్న వాల్ మార్ట్
- May 09, 2018
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్..వాల్‌మార్ట్ సొంతమైపోయింది. కొద్ది రోజులుగా ఈ రెండు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలకు ఈ రోజుతో ఫుల్స్టాప్ పడింది. డీల్ ఖరారు కావడంతో, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్... ఫ్లిప్‌కార్ట్ ను సొంతంచేసుకున్నట్లు ఈ సంస్థ ప్రధాన వాటాదారైన సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషి సన్ ధృవీకరించేశారు. 2007లో బెంగళూరులో రెండు బెడ్రూం అపార్ట్మెంట్లో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు అమెజాన్ మాజీ ఉద్యోగులు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్. అలా మొదలైన సంస్థ అంతకంతకు ఎదుగుతూ 2014లో ఆన్లైన్ అప్పీరల్ రిటైలర్ మింత్రాను 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫోన్‌పేను 2016లోనే తన సొంతం చేసుకుంది. అనంతరం జబాంగ్ను 2016లో 70 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







