అక్కినేని నాగార్జునకు ఈ పుత్రోత్సాహం..!
- May 10, 2018
'ఒక తండ్రిగా గర్విస్తున్నా.. ఒక కొడుకుగా అసూయతో కుంగిపోతున్నా' టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున రేరెస్ట్ వర్డ్స్ ఇవి. ఇన్నేళ్ల తన కెరీర్‌లో నాన్న గారి పాత్రను ఎప్పుడూ చేయలేకపోయానని, కానీ.. ఆ పనిని చైతూ చేయడం అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చిందని ట్వీట్ చేశాడు నాగ్. 'మహానటి' సావిత్రి మూవీలో లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ రోల్ చేసిన నాగచైతన్యనుద్దేశించి తండ్రి నాగార్జున చేసిన ఈ కామెంట్.. టాలీవుడ్‌ని బాగా 'టచ్' చేసింది.
అప్పట్లో సావిత్రికి జతగా అనేక సినిమాల్లో చేసిన ఏఎన్నార్ పాత్ర కోసం ప్రొడ్యూసర్లు చైతూను అప్రోచ్ కావడం.. అతను ఓకె చెప్పడం.. తాత వేషమేసి మెప్పించడం అన్నీ జరిగిపోయాయి. 'మనం' మూవీలో అక్కినేనితో కలిసి నటించిన చైతూ.. ఇప్పుడు 'మహానటి'లో అక్కినేని ఎర్లీడేస్‌ని మరిపించాడు.
అందుకే.. అక్కినేని నాగార్జునకు ఈ పుత్రోత్సాహం..!
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







