అవయవదానం చేసిన క్రికెటర్స్

- May 10, 2018 , by Maagulf
అవయవదానం చేసిన క్రికెటర్స్

దిల్లీ డేర్‌డెవిల్స్‌  టీంకు చెందిన  భారత ఆటగాళ్లందరూ  అవయవదానం చేశారు.  ‘స్పిరిట్‌ ఆఫ్‌ గివింగ్‌’ పేరిట అవయవదానంపై అవగాహన కల్పించేందుకు దిల్లీ డేర్‌డెవిల్స్‌   యాజమాన్యం ఓ  వినూత్న కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది.  దీనిలో  భాగంగానే  భారత ఆటగాళ్ళు  గౌతమ్‌ గంభీర్‌, పృథ్వీ షా తదితర ఆటగాళ్లు తాము అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. గౌతమ్ గంభీర్‌ ఈ  కార్యక్రమాన్ని  ఉద్దేశించి  మాట్లాడుతూ  " ప్రతి ఒక్కరు అవయవదానం చేయాలి.  మీరు చేసే దానం వలన  మరొకరికి  జీవితం  నిలబడుతుంది.  జీవితంలో ఇంతకన్నా గొప్ప దానం ఏది ఉండదు.  కావున ఈ కార్యక్రమంలో అందరు   భాగ్యసామ్యం కావాలని" గంభీర్‌ కోరాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com