మనామా:14 ఏళ్ళ బాలుడ్ని రక్షించిన సివిల్ డిఫెన్స్
- May 11, 2018
మనామా: 14 ఏళ్ళ బాలుడు, ఆత్మహత్యకు యత్నించగా, అతన్ని క్షేమంగా రక్షించింది సివిల్ డిఫెన్స్. సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ముగ్గురు అధికారులు, 10 మంది సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి బాలుడ్ని రక్షించడానికి అన్ని చర్యలూ చేపట్టారు. అయితే బాలుడు దూకేస్తానని బెదిరించడంతో, మరింత జాగ్రత్తగా సిబ్బంది బాలుడున్న చోటుకి చేరుకున్నారు. అనంతరం అతన్ని జాగ్రత్తగా పట్టుకుని, కిందికి తీసుకొచ్చారు. అనంతరం బాలుడ్ని ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు, స్కూలు సిబ్బంది ఇలాంటి పిల్లలను గుర్తించాలనీ, వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇప్పించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..