దుబాయ్:వ్యక్తి చేతి వేలిని కత్తిరించిన సేల్స్‌మెన్‌

- May 11, 2018 , by Maagulf
దుబాయ్:వ్యక్తి చేతి వేలిని కత్తిరించిన సేల్స్‌మెన్‌

దుబాయ్:ఆసియాకి చెందిన సేల్స్‌మెన్‌ ఒకరు, తన తల్లిని దూషించారని ఆరోపిస్తూ, ఓ వ్యక్తి చేతి వేలిని కత్తిరించేశాడు. ఈ ఘటనలో బాధితుడ్ని జిసిసి జాతీయుడిగా గుర్తించారు. వాట్సాప్‌ ద్వారా ఇరువురూ వాదులాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిసిసి జాతీయుడు, ఆసియా జాతీయుడి తల్లిని దూషించాడు. ఈ క్రమంలో సేల్స్‌మెన్‌, గల్ఫ్‌ జాతీయుడ్ని పిలిచి, డాగర్‌తో అతని చేతి వేలిని కట్‌ చేసేశాడు. బాధితుడి కుమారుడు, చాకచక్యంగా తన తండ్రిని ఆ గొడవ నుంచి తప్పించాడు. గల్ఫ్‌ జాతీయుడి కుమారుడిపైనా నిందితుడు దాడికి యత్నించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com